గరిష్ఠ స్థాయి వద్ద ముగిసిన నిఫ్టి
మిడ్ సెషన్‌లో కాస్త ఒత్తిడికి లోనైనా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. చివర్లో వచ్చిన షార్ట్ కవరింగ్‌లో నిఫ్టి 17200 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 247 పాయింట్లు లాభపడింది. యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవడంతో మన మార్కెట్‌లో కూడా కొనుగోలు ఆసక్తి కొనసాగింది. నిఫ్టి దాదాపు ఒకటిన్నర శాతం లాభ పడగా, నిఫ్టి నెక్ట్స్ 2.35 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి మిడ్ క్యాప్ కూడా 1.8 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లతో పోలిస్తే నిఫ్టి బ్యాంక్ స్వల్పంగా 0.89 శాతం లాభానికే పరిమితమైంది. అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్ కాగా, ఓఎన్‌జీసీ టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ముగిశాయి.