లాభాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. నిన్న రాత్రి కరెన్సీ మార్కెట్లో డాలర్ బాగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 98 దిగువకు వచ్చేసింది. క్లోజింగ్‌లో కోలుకుని ఇపుడు 98 ప్రాంతంలో ఉంది. అయితే క్రూడ్ ఆయిల్ జోరు మాత్రం తగ్గడం లేదు. నిన్న భారీ లాభాలతో క్లోజైంది. ఇవాళ కూడా స్వల్పలాభాలతో ఉంది. బ్రెంట్ క్రూడ్ 109 డాలర్లకు చేరువగా ఉంది. గత వారం భారీగా తగ్గినట్లే తగ్గిన క్రూడ్ ఈవారం పుంజుకోవడంతో భారత్ వంటి మార్కెట్లో ఆందోళన వ్యక్తమౌతోంది.