For Money

Business News

ఇవాళ షేర్‌ మార్కెట్‌కు సెలవు కాని…

హోలి సందర్భంగా ఇవాళ షేర్‌ మార్కెట్‌కు సెలవు. రెండు ఎక్స్ఛేంజీలూ పనిచేయవు. రేపు, ఎల్లుండి కూడా సెలవు కాబట్టి… తిరిగి సోమవారం మార్కెట్లు ప్రారంభమౌతాయి.అయితే కమాడిటీస్‌ మార్కెట్లు మాత్రం ఉదయం సెషన్‌ మాత్రమే సెలవు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవు. రెండో సెషన్‌ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు పనిచేస్తాయి. కరెన్సీ మార్కెట్‌ పనిచేయదు. అయితే క్రూడ్‌ ఆయిల్‌, బులియన్‌ మార్కెట్లు మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.55 వరకు పనిచేస్తాయి.