For Money

Business News

నంబర్‌ వన్‌ హిందీ న్యూస్‌ ఛానల్

17 నెలల తరవాత ఇవాళ న్యూస్‌ ఛానల్స్‌ రేటింగ్స్‌ వచ్చాయి. మార్చి 5 నుంచి 11వ మధ్య కాలానికి దేశ వ్యాప్తంగా హిందీ న్యూస్‌ ఛానల్స్‌లో టీవీ9 భారత్‌ వర్ష్‌ నవంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆజ్‌తక్‌, మూడో స్థానం రిపబ్లిక్‌ భారత్‌ నిలిచాయి. ఇక ఇంగ్లిషు న్యూస్‌ ఛానల్స్‌లో రిపబ్లిక్‌ టీవీ నంబర్‌ వన్‌గా రాగా, టైమ్స్‌ నౌ రెండో స్థానంలో ఇండియా టుడే మూడో స్థానంలో నిలిచాయి. ఎన్‌డీటీవీతో పాటు పాలు న్యూస్‌ ఛానల్స్‌ బార్క్‌ రేటింగ్‌ నుంచి బయటకు వెళ్ళిపోయాయి.
హిందీ న్యూస్‌ ఛానల్స్‌…
1. టీవీ9 భారత్‌ వర్ష్‌
2. ఆజ్‌ తక్‌
3. రిపబ్లిక్ భారత్‌
4. ఇండియా టీవీ
5. జీ న్యూస్‌
ఇంగ్లిషు న్యూస్‌ ఛానల్స్‌
1. రిపబ్లిక్‌ టీవీ
2. టైమ్స్‌ నౌ
3.ఇండియా టుడే
4. సీఎన్‌ఎన్‌
5. వియాన్‌ (Wion)

ఇక బిజినెస్ న్యూస్‌ ఛానల్స్‌లో సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌ 89.7 శాతం మార్కెట్‌ వాటాతో నంబర్‌ వన్‌ ఛానల్‌గా నిలిచింది.