For Money

Business News

మక్వెరీ క్యాపిటల్‌ టార్గెట్‌ రూ. 450

పబ్లిక్‌ ఆఫర్‌ ధర నుంచి పేటీఎం షేర్‌ పడుతూనే ఉంది. దాదాపు 71 శాతం క్షీణించి రూ. 634 ప్రాంతంలో ఇపుడు ట్రేడవుతోంది. అయితే ఈ కంపెనీపై రీసెర్చి చేస్తున్న పలు కంపెనీలు పేటీఎం టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మక్వెరీ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ సంస్థ గతంలో ఈ షేర్‌ టార్గట్‌ ధర రూ. 700గా పేర్కొంది. తాజా దీన్ని రూ. 450కి తగ్గించింది. అంతర్జాతీయంగా ఫిన్‌ టెక్‌ కంపెనీల వ్యాల్యూయేషన్‌ బాగా తగ్గడంతో తాము కూడా పేటీఎం టార్గెట్‌ ధరను తగ్గించినట్లు పేర్కొంది. అయితే కంపెనీ టర్నోవర్‌, లాభం విషయంలో తమ అంచనాల్లో మార్పు లేదని పేర్కొంది. కేవలం ఈ రంగానికి చెందిన షేర్ల వ్యాల్యుయేషన్‌ బాగా తగ్గుతోందని మక్వెరీ క్యాపిటల్‌కు చెందిన విశ్లేషకుడు సురేష్‌ గణపతి అన్నారు.