MID REVIEW: బ్యాంకు నిఫ్టి అండ
మార్కెట్ గరిష్ఠస్థాయిని దాటకున్నా… ఆకర్షణీయ లాభాల్లో ఉంది. ఉదయం నిఫ్టి 16757 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అదే గరిష్ఠస్థాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా ఉండటంతో లాభాలు కొనసాగుతున్నాయి. గరిష్ఠ స్థాయి నుంచి 150 పాయింట్లు తగ్గినా నిలకడగా ఉంది. యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్నటి భారీ లాభాల తరవాత ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇపుడు 310 పాయింట్ల లాభంతో 16655 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి నుంచి ఇవాళ నిఫ్టికి గట్టి మద్దతు లభిస్తోంది. బ్యాంక్ నిఫ్టి 3 శాతంపైగా లాభంతోంది. మరి ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కావడంతో… క్లోజింగ్ ఎలా ఉంటుందో చూడాలి.