For Money

Business News

16,750ని తాకిన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా భారీ లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16,757 పాయింట్లను తాకింది. ఇపుడు 16672 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 327 పాయింట్ల లాభంతో ఉంది. గత కొన్ని రోజులుగా భారీ క్షీణించిన షేర్లు ఇవాళ అదే స్పీడుతో పెరుగుతున్నాయి. క్రూడ్‌ ధరలు పెరిగినందున.. భారీగా క్షీణించిన ఏషియన్‌ పెయింట్స్‌ 5 శాతం లాభంతో రూ.3018ని తాకింది. ఇదే కారణంగా గత కొన్ని రోజుల్లో భారీగా పెరిగిన ఓఎన్‌జీసీ షేర్లు నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా 1000 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు కూడా రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి.