16,600 దిగువన నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16,600 దిగువకు చేరింది. దాదాపు 230 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టి ప్రస్తుతం 16,580 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి రెండు శాతంపైగా నష్టపోగా… మిడ్ క్యాప్ నిఫ్టి మాత్రం కేవలం 0.28 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో టాప్ గెయినర్స్‌గా కోల్ ఇండియా, ఓఎన్జీసీ నిలిచాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్‌గా బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ ఫిబ్రవరి అమ్మకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఈ షేర్ 4.65 శాతం నష్టంతో 3366 వద్ద ట్రేడవుతోంది. తరవాతి స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది.