For Money

Business News

NIFTY TRADE: 16500 కీలకం

నిఫ్టి 16550-490 స్థాయిని బ్రేక్‌ చేస్తే నిఫ్టిని షార్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని సీఎన్‌బీసీ ఆవాజ్‌ డేటా అలనిస్ట్‌ వీరందర్‌ అంటున్నారు. 16,550-16,640 న్యూట్రల్‌ జోన్‌ అని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిని దాటి 16710ని దాటితే నిఫ్టి బలోపేతం అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. క్యాష్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం కూడా భారీగా అమ్ముతున్నారు. కాని ఫ్యూచర్స్‌లో షార్ట్స్‌ కవర్ చేస్తున్నారని వీరేందర్‌ తెలిపారు. ఎఫ్‌ అండ్‌ ఓలో కూడా విదేశీ ఇన్వెస్టర్లు చురుగ్గా ఉన్నాయి. నిఫ్టిని షార్ట్‌ చేసినట్లు కన్పిస్తోందని వీరేందర్‌ అన్నారు. సో.. నిఫ్టికి 16550 లేదా 16490 ప్రాంతంలో మద్దతు లభించవచ్చని ఆయన అంటున్నారు. ఆ స్థాయిలను కోల్పోతే 16410 లేదా 16365 స్థాయికి నిఫ్టి వెళ్ళే ప్రమాదముందని అంటున్నారు. నిఫ్టికి ఇవాళ 16660 లేదా 16710 ప్రాంతంలో గట్టి నిరోధం వస్తుంది. ఈ స్థాయి దాటితే 16780 లేదా 16840కి చేరొచ్చిన అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌, ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.