మార్చి 11న ఎల్ఐసీ యాంకర్ ఇష్యూ ?
ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని అధికార వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మార్చి తొలివారంలో ఎల్ఐసీ ఐపీవోకు సెబీ అనుమతి ఇస్తుందని, ఆ వెంనటే ఇష్యూ ధరల శ్రేణిని నిర్ణయించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్ఐసీ నిరాకరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. మార్చి మూడోవారంలో ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ ఉంటుందని భావిస్తున్నారు.