For Money

Business News

పెరిగిన డాలర్‌ మిలియనీర్లు

మన దేశంలో డాలర్‌ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు హురున్‌ రిపోర్ట్‌ సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ భారత్‌లో డాలర్‌ మిలియనీర్ల సంఖ్య 4.58 లక్షలను తాకినట్టు ఆ నివేదిక పేర్కొంది. 2026 నాటికి దేశంలో డాలర్‌ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షలను తాకవచ్చని అంచనా వేసింది. ముంబైలో అత్యధికంగా 20,300 మంది డాలర్‌ మిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 మంది డాలర్‌ మిలియనీర్లు ఉన్నట్లు హురున్‌ రిపోర్టు వెల్లడించింది.