ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా రష్యా దాడి
రానున్న 48 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయాల్సిందిగా తన దేశ పౌరులను అమెరికా హెచ్చరించింది. భారీ మిలిటరీ చర్యలు తీసుకునేందుకు రష్యా సిద్ధంగా ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ అన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కాని రిస్క్ మాత్రం అధికంగా ఉంది. కాబట్టి వెంటనే ఉక్రెయిన్ నుంచి బయటపడటం ఉత్తమమని ఆయన హెచ్చరించారు. తొలుత యుద్ధ విమానాల ద్వారా ఉక్రెయిన్‌పై దాడులు జరిగే అవకాశముందని రష్యా హెచ్చరించింది. ఒక్కసారి ఈ దాడులు ప్రారంభమైతే.. ఉక్రెయిన్ నుంచి రావడం కష్టమని, అందుకని ఇపుడే వచ్చేయాల్సిందిగా వైట్‌హౌస్ పేర్కొంది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైన్యాన్ని రష్యా దింపింది. అమెరికాతో పాటు అనేక దేశాలు..తమ దేశ ప్రజలను ఉక్రెయిన్ ఖాళీ చేయాల్సిందిగా కోరాయి. అయితే ఉక్రెయిన్‌పై దాడులు చేసే ఉద్దేశం తనకు లేదని రష్యా పదే పదే అంటోంది. పాశ్చాత్య దేశాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది.