డాక్టర్ రెడ్డీస్ చేతికి నింబస్ హెల్త్
జర్మనీకి చెందిన నింబస్ హెల్త్ GmbHను డాక్టర్ రెడ్డీల్ ల్యాబ్ టేకోవర్ చేయనుంది.ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. జర్మనీలో ఫార్మాస్యూటికల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కంపెనీని డాక్టర్ రెడ్డీ కొనుగోలు చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేసింది కంపెనీ వెల్లడించలేదు. వైద్య పరమైన గంజాయి ఆధారిత ఔషధాల వినియోగం యూరప్‌లో భారీగా పెరుగుతోంది. ఈ రకమైన మందులను అమ్మడంలో నింబస్ హెల్త్‌కు మంచి నెట్వర్క్ ఉంది.