For Money

Business News

అంచనాలను మించిన ఐటీసీ

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ చక్కటి లాభాలను ప్రకటించింది.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.69 శాతం పెరిగి రూ. 4156 కోట్లకు చేరింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 3687 కోట్లు. ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన పోల్‌లో పాల్గొన్నవారు కంపెనీ నికర లాభం రూ.3873 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అంటే కంపెనీ పనితీరు అంచనాలను మించిందన్నమాట. ఇక కంపెనీ ఆదాయం ఏకంగా 31 శాతం పెరిగి రూ. 12,673 కోట్ల నుంచి రూ. 16,633 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ. 5.25 చొప్పన తాత్కాలిక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీ ఫిబ్రవరి 15 కాగా, మార్చి 4కల్లా రికార్డు తేదీన కంపెనీ ఖాతాల్లో ఉన్న ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ జమ చేస్తారు. కంపెనీ ఆదాయంలో రూ. 6244 కోట్లు సిగరెట్ల అమ్మకం ద్వారా రాగా, ఎఫ్‌ఎంసీజీ విభాగం నుంచి రూ. 4090 కోట్ల ఆదాయం వచ్చింది.