For Money

Business News

దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.03 కోట్లు

డిసెంబర్‌నెల ముగిసే నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.03 కోట్లకు చేరింది. వీరందరూ ఉద్యోగం కోసం ఎక్కడ ఒక చోట ప్రయత్నిస్తున్నారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మానేసినవారు 1.24 కోట్లు. వీరిని కూడా కలుపుకుంటే దేశంలో నిరుద్యోగుల సంఖ్య 4.27 కోట్లకు చేరింది. కరోనా రాకుముందు డిసెంబర్‌ 2017నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 1.77 కోట్లు మాత్రమేనని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (CMIE) పేర్కొంది. దేశంలో నిరుద్యోగుల డేటా ఈ ఒక్క సంస్థే వెల్లడిస్తుంది. ఆర్బీఐతో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ డేటాను విశ్వసిస్తయి. నిరుద్యోగుల్లో 29 ఏళ్ళలోపు వారు 95 శాతమని CMIE పేర్కొంది. అందులోనూ 20 నుంచి 24 ఏళ్ళ మధ్య వయస్సుల సంఖ్య 2.03 కోట్లని CMIE వెల్లడించింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఎన్ని పథకాలు ప్రారంభించినా నిరుద్యోగ భారీగా పెరిగిందని CMIE తెలిపింది. నిర్మాణం, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది.ఈ రంగాలు కోలుకునేవారకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని CMIE అంటోంది.