For Money

Business News

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ ప్రజలకు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి మధ్యలో ఆర్‌డీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ కొత్త రేట్లు జనవరి 15, 2022 నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. ఎస్‌బీఐలో కేవలం 100 రూపాయల డిపాజిట్‌లోనే రికరింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ) అకౌంట్ తెరిచే అవకాశముంది. 12 నెలల నుంచి పదేళ్ల సమయం వరకు ఎంత కాలానికైనా ఆర్‌డీ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ అన్ని కాలాల ఆర్డీలకు ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది.