For Money

Business News

NIFTY TODAY: 18200 దాటేనా?

నిఫ్టి ఇవాళ చాలా గ్యాపప్‌తో ప్రారంభం కానుంది. మార్కెట్‌ మూడు చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18200ని తాకే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 18055. కనీసం 18173ని దాటే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టి గనకు 18200 దాటే పక్షంలో 18231 వద్ద ప్రతిఘటన రావొచ్చు. ఈ స్థాయిని నిఫ్టి దాటడం కష్టమే. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున అధిక స్థాయిలో నిఫ్టికి కాస్త ఒత్తిడి రావొచ్చు. డే ట్రేడర్స్‌కు ఇవాళ పెద్ద ట్రేడింగ్‌ లాభం ఉండకపోవచ్చు. రిస్క్‌ తీసుకునేవారు 18200పైన అమ్మి… స్వల్ప లాభంతో బయటపడొచ్చు. మార్కెట్‌లో పొజిషనల్‌ ట్రేడర్స్‌ 17560 స్టాప్‌లాస్‌తో పొజిషన్స్‌ కొనసాగించవచ్చని దాదాపు రెండు వారాల నుంచి టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. మరి నిఫ్టి గరిష్ఠ స్థాయిని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. మార్కెట్ మూడు ఏరోజుకు ఆరోజు లెక్కన చూడాలని వీరు అంటున్నారు. ఆర్థిక ఫలితాలు రావడం మొదలైంది.దీంతో సూచీ కన్నా… షేర్లను చూసి ట్రేడ్‌ చేయాలని సూచిస్తున్నారు.