For Money

Business News

ప్రతినెలా విద్యుత్ చార్జీల వడ్డన!

తెలంగాణలో ఇక నెల నెలా విద్యుత్‌ చార్జీలు సవరించే పద్ధతి అమల్లోకి వచ్చే అవకాశముంది. డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే..ఆ మొత్తాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేసుకోవడానికి ఏడాది వరకు ఆగాల్సి వచ్చేది. కాని ఒక నెలలో పెరిగిన వ్యయాన్ని తరువాతి నెలలోనే రాబట్టుకునేలా అనుమతి ఇవ్వాలని విద్యుత్‌ రెగ్యులేటరి కమీషన్‌ను కోరాయి డిస్కమ్‌లు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ రూల్స్‌ 2020 ప్రకారం డిస్కమ్‌లకు ఈ వెసులుబాటు దక్కింది. దీన్ని ఆధారంగా తమకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ డిస్కమ్‌లు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనపై విచారణ తరవాత రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి ఇస్తే … వెంటనే డిస్కమ్‌లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
స్థిర, కస్టమర్‌ చార్జీలు పెంపు..
దీనికి తోడు విద్యుత్‌ వినియోగానికి సంబంధించి స్థిర (ఫిక్స్‌డ్‌) చార్జీలు, కస్టమర్‌ చార్జీలను పెంచేందుకు కూడా అనుమతి ఇవ్వాలని తెలంగాణ డిస్కమ్‌లు కోరారు. ఇప్పటిదాకా ఎల్‌టీ గృహ వినియోగంలో స్థిర చార్జీలు లేవు. ఇకపై అన్ని కేటగిరీల వారికీ స్థిర చార్జీలను అమలు చేయనున్నాయి. అలాగే కస్టమర్‌ చార్జీలనూ పెంచనున్నాయి.