For Money

Business News

చేనేతపై జీఎస్టీ పెంపు వాయిదా?

జీఎస్టీ కౌన్సిల్‌ ఎల్లుండి అంటే ఈనెల 31న ఢిల్లీలో సమావేశం కానుంది. కౌన్సిల్‌ సభ్యులందరూ ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రూ. 1000 లోపు ఉన్న పాదరక్షలతో పాటు టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ పెంపును వాయిదా వేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రూ.1000 లోపు ఉన్న పాదరక్షలపై కూడా 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే టెక్స్‌టైల్స్‌పై కూడా జీఎస్టీని 12 శాతానికి పెంచాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా చేనేతపై 12 శాతం జీఎస్టీ విధించడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అలాగే రూ. 1000 లోపు పాదరక్షలపై కూడా జీఎస్టీ వేయడాన్ని మధ్య తరగతి, పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఈ నిర్ణయాల అమలును వాయిదే వేసే అంశంపై 31న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.