12 ఏళ్ళ పైబడినవారికీ కోవాగ్జిన్
12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కులకు కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. కొన్ని షరతులతో ఈ ఆమోదం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ పీటీఐ వార్తా సంస్థ రాసింది. 12 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని గత అక్టోబర్‌లో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) సిఫారసు చేసింది. పిల్లల కోసం ఆమోదించిన రెండో వ్యాక్సిన్ ఇది. గత ఆగస్టులో జైడస్ క్యాడిలాకు చెందిన మూడు డోసుల డీఎన్‌ఏ టీకాకు డీజీసీఐ ఆమోదం తెలిపింది. అదికూడా 12 ఏళ్ళపైబడిన పిల్లలకు వాడేందుకు అనుమతి ఇచ్చింది.