ఆల్గో లెవల్స్‌కు పరిమితమైన నిఫ్టి
టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా నిఫ్టి కదలాడింది. ఉదయం 11,476 వద్ద ప్రారంభమైన నిఫ్టి… తరవాత 17,405కి పడిపోయింది. తరవాత స్వల్ప నష్టాలతో మిడ్ సెషన్ వరకు కొనసాగింది. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి కోలుకుంది. ట్రేడింగ్ ముగిసేముందు నిఫ్టి నష్టాలన్నీ పూడ్చుకుని గ్రీన్‌లో వచ్చింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 17,534 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 6 పాయింట్ల నష్టంతో 17511 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 29 షేర్లు నష్టాలతో ముగిశాయి.ఆసియా మార్కెట్ల స్థాయిలోనే యూరో మార్కెట్లు కూడా స్వల్ప నష్టాలకే పరిమితం కావడంతో నిఫ్టి…స్థిరంగా ముగిసింది.