కియా కారెన్స్ వచ్చే ఏడాదిలో…
రిక్రియేషన్ వెహికిల్ (ఆర్‌వీ)ని ‘కారెన్స్’ పేరుతో తీసుకొస్తున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. వచ్చే ఏడాది ఆరంభంలో తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈకరులో మూడు వరుసల సీట్లు ఉంటాయి. ‘కారెన్స్’ పలు కార్ల విభాగాలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. ఒక కీలక మలుపును తీసుకు రాబోతోందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టాయ్ జిన్ పార్క్ అన్నారు. ఈ కొత్త మోడల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న కియా కార్ల తయారీ కేంద్రం నుంచి రానుంది. డిసెంబరు 16న కారెన్స్‌ను ప్రదర్శించనున్నట్లు కియా వెల్లడించింది.