నైకా లిస్టింగ్ నేడే… భారీ లాభం ఖాయం
అనుకున్న రోజుకంటే ఓ రోజు ముందుగానే ఎఫ్ఎస్ఎన్ ఇ కామర్స్ ఐపిఓ (నైకా) ఇవాళ లిస్ట్ అవుతోంది. ఇప్పటికే షేర్ల అలాట్మెంట్ ప్రాసెస్‌తో పాటు రీఫండ్ ప్రాసెస్ కూడా పూర్తి అయింది. ఈ పబ్లిక్ ఇష్యూకు అనధికార మార్కెట్లో భారీ ప్రీమియం లభిస్తోంది. నిన్న కూడా గ్రే మార్కెట్లో ఈ షేర్‌ను రూ. 700పైగా అధిక ధర చెల్లించి కొనడానికి ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. ఈ లెక్కన ఈ షేర్ ఓపెనింగ్‌లోనే రూ. 2000 పలుకుతుందా అన్నది చూడాలి. ఈ షేర్ గరిష్ఠ ధర రూ. 1,125 కాగా, ఓపెనింగ్‌లోనే ఈ షేర్‌కు 70 నుంచి 80 శాతం లాభం లభించే అవకాశముంది.