For Money

Business News

వడ్డీ రేట్ల హనీమూన్‌ అయిపోయనట్లే

రుణాలపై తక్కువ వడ్డీ రేట్ల సీజన్‌ అయిపోవస్తోంది. ఇప్పటి వరకు పోటీ పడి వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు … క్రమంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశముంది. వెంటనే ప్రధాన బ్యాంకులు పెంచకపోయినా… ఇక తగ్గించే అవకాశాలు లేనట్లేనని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ నెల నుంచి అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీకి మద్దతును క్రమంగా తగ్గించనున్నారు. వడ్డీ రేట్లను పెంచకపోయినా… నిధుల లభ్యత మార్కెట్‌లో తగ్గనున్న నేపథ్యంలో ‘చీప్‌ లోన్స్‌’ ఇక దొరకవని అంటున్నారు. మనదేశంలో కూడా ద్రవ్యోల్బణం తగ్గడం లేదు. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌… గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా పెంచింది. డిసెంబరు పదో తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి రానుందని తెలిపింది. కొత్త వడ్డీ రేటు 0.05 శాతం మేర పెంచుతున్నట్లు వెల్లడించింది.