నిఫ్టి: రోజంతా నష్టాల్లోనే…
నిఫ్టి ట్రేడింగ్ ఇవాళ పూర్తిగా ఆల్గో లెవల్స్ ప్రకారం సాగింది. 18,100పైన నిఫ్టికి ఒత్తిడి రాగా, 18,000 ప్రాంతంలో మద్దతు అందింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 18,112 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అక్కడి నుంచి కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి వచ్చి… రోజంతా నష్టాల్లోనే సాగింది. మిడ్ సెషన్ తరవాత ఒక మోస్తరు అమ్మకాల ఒత్తిడి ఎదురై 17,983కి చేరింది…. క్లోజింగ్కల్లా దాదాపు క్రితం స్థాయికి వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో 18,062 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 26 షేర్లు గ్రీన్లో ఉన్నా.. లాభాలు నామ మాత్రంగానే ఉండటంతో నిఫ్టికి నష్టాలు తప్పలేదు. ఇవాళ బ్యాంక్ నిఫ్టి కూడా స్థిరంగా ముగిసింది. ఇవాళ భారీ లాభాలు మాత్రం నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ సూచీలకే దక్కాయి.