NIFTY TRADE: పెరిగితే అమ్మండి
నిఫ్టి క్రితం ముగింపు 17,916. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17970 వద్ద ఎదురు కానుంది. 18,000 దాటితే నిఫ్టి పటిష్ఠంగా ట్రేడ్ కావొచ్చు. కాని ఇవాళ ఆ పరిస్థితి రాకపోవచ్చు. కాబట్టి 18,000 స్టాప్లాస్తో నిఫ్టిని అమ్మొచ్చు. నిఫ్టికి 17900 కీలక స్థాయి. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టి 17,870 ప్రాంతంలో మద్దతు అందుతుందేమో చూడాలి. లేకుంటే నిఫ్టి 17850కి చేరొచ్చు. అయితే నిఫ్టికి ఈ రెండు స్థాయిలో మద్దతు అందే అవకాశముంది. కాబట్టి పై స్థాయిలే అమ్మేవారు ఈ స్థాయిల్లో బయటపడే అంశాన్ని పరిశీలించవచ్చు.