For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా మార్కెట్‌ పటిష్ఠంగా ఉంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. డౌజోన్స్‌ అర శాతంపైగా లాభంతో శుక్రవారం ముగిసింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. గతవారాంతంలో భారీగా క్షీణించిన హాంగ్‌సెంగ్‌ ఇవాళ కూడా నష్టాలతో ట్రేడవుతోంది. అలాగే జపాన్‌ మార్కెట్లు కూడా. అయితే జపాన్‌ మార్కెట్‌ నామమాత్రపు నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవు. సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.