For Money

Business News

7 లెవెన్‌ స్టోర్స్‌ వచ్చేస్తున్నాయి

ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదరిన ఒప్పందం రద్దు కావడంతో 7 లెవెన్‌ స్టోర్స్‌ను రిలయన్స్‌ రీటైల్స్‌ ప్రారంభించనుంది. అమెరికాకు చెందిన ఈ స్టోర్స్‌ మంచి క్రేజ్‌ ఉంది. తొలి స్టోర్‌ను ఎల్లుండి ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో రిలయన్స్‌ రిటైల్ ప్రారంభించనుంది. తరవాత దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఈ స్టోర్స్‌ను ప్రారంభిస్తారు.దీని కోసం రిలయన్స్‌ రీటైల్‌ కొత్తగా 7 ఇండియా కన్వీనియన్స్‌ రీటైల్‌ లిమిటెడ్‌ ప్రారంభించింది. అమెరికా కంపెనీతో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టోర్స్‌ ద్వారా అంతర్జాతీయ బ్రాండ్‌లను భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ ఇషా అంబానీ తెలిపారు.