For Money

Business News

బిగ్‌బుల్‌ రాకేష్‌తో ప్రధాని భేటీ

భారత స్టాక్‌ మార్కెట్‌లో ‘బిగ్‌ బుల్‌’గా పేరొందిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ అధినేత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. విద్యా రంగం గురించి జరిగిన ఒక కార్యక్రమంలో రాకేష్‌ దంపతులతో మోడీ భేటీ అయ్యారు. వాస్తవానికి ఈ భేటీ 5వ తేదీన జరిగింది. బుధవారం మోడీ ఈ భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ఒకే ఒక్క’ ఝున్‌ఝున్‌వాలాను కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మోడీతో భేటీ తరవాత బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేష్‌ సొంతంగా విమానయాన కంపెనీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే.