For Money

Business News

బీఎండబ్ల్యూ కొత్త ఎక్స్‌5

బీఎండబ్ల్యూ ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్‌6లో కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తెచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ ట్రైన్‌ల్లో ఇవి లభించనున్నాయి. 3-లీటర్‌ సిక్స్‌-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన X5 ఎక్స్‌డ్రైవ్‌30డీ స్పోర్ట్‌ఎక్స్‌ ప్లస్‌ ధర రూ.77.9 లక్షలుగా, పెట్రోల్‌ X5 ఎక్స్‌డ్రైవ్‌40ఐ స్పోర్ట్‌ఎక్స్‌ ప్లస్‌ ధర రూ.79.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఈ రెండు వేరియంట్లను కంపెనీ చెన్నై ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. X5 ఎక్స్‌డ్రైవ్‌30డీ గంటకు 0-100 కి.మీ వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.