For Money

Business News

హైదరాబాద్‌లో జేపీ మోర్గాన్‌ కొత్త ఆఫీసు

ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అతిపెద్ద కార్యాలయాన్ని జేపీ మోర్గాన్‌ హైదరాబాద్‌లో ప్రారంభించింది. దాదాపు 8,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌సిటీలోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ సిటీలో ఈ కొత్త ఆఫీసు ఏర్పాటయ్యింది. హైదరాబాద్‌లో ఉన్న టెక్నాలజీ, రిస్క్‌, ఆపరేషన్స్‌, ఇతర విభాగాలన్నీ ఇప్పుడు ఒకే చోట పనిచేయనున్నాయి. భారత్‌లో తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ ఎంతో కీలకంగా ఉందని జేపీ మోర్గాన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ హెడ్‌ డేనియల్‌ విల్కెనింగ్‌ పేర్కొన్నారు. పూర్తిగా అధునాతనంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించినట్లు ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.