For Money

Business News

ప్రసోల్ కెమికల్స్- దీర్ఘ కాలానికి

ప్రసోల్ కెమికల్స్ పబ్లిక్‌ ఆఫర్‌ మంగళవారం ప్రారంభమైంది. గురువారం ఆఫర్‌ ముగియనుంది.1992లో ప్రాచీ పాలీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఏర్పడిన ఈ కంపెనీ 2007లో ప్రసోల్ కెమికల్స్‌గా మారింది. అసిటోన్‌తో పాటు ఫాస్ఫరస్ ఆధారిత ప్రత్యేక రసాయనాలను ఫార్వర్డ్-ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ఈ కంపెనీ తయారు చేస్తుంది. స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ప్రతి కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా కెమికల్స్‌ను తయారు చేస్తోంది ఈ కంపెనీ. అలాగే కొన్ని ప్రత్యేక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
మార్కెట్‌ నుంచి రూ. 500 కోట్ల సమీకరణ కోసం కంపెనీ ప్రైమరీ మార్కెట్‌కు వచ్చింది. ఇందులోరూ. రూ 80 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజా ఈక్విటీ కింద జారీ చేస్తారు. ఇపుడున్న వాటాదారులు రూ.420 కోట్ల కోట్ల విలువైన షేర్లను ఈ ఆఫర్‌లో విక్రయిస్తారు. ఐపీఓ ధరల శ్రేణి రూ.643– రూ. 676. కనీసం ఒక లాట్‌ అంటే 22 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని, కేవలం ప్రస్తుత ఇన్వెస్టర్లలో కొంత వాటా విక్రయానికే ఈ ఆఫర్‌ అని కంపెనీ అంటోంది. చాలా బ్రోకరేజీ సంస్థలు ఈ ఆఫర్‌కు దరఖాస్తు చేయాల్సిందిగా సిఫారసు చేశాయి. లిస్టింగ్‌లాభాలు పది శాతం దరిదాపుల్లో ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలానికి మాత్రం మంచి ప్రతిఫలాలను అందిస్తుందని చెబుతున్నారు.

Leave a Reply