క్రూడ్ మళ్ళీ జంప్
ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న క్రూడ్ ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ కంపెనీ ఆరామ్‌కోకు చెందిన రిఫైనరీపై హౌతీలు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే బ్రెంట్ క్రూడ్ 88.50 డాలర్లకు చేరింది. ఉదయం నుంచి క్షీణిస్తూ వచ్చిన బ్రెంట్ ఇవాళ మిడ్ సెషన్ కల్లా 85.86 డాలర్లకు పడింది. అయితే అమెరికా మార్కెట్లు ప్రారంభం కాగానే ఆయిల్ మళ్ళీ పెరగనారంభించింది. ఇపుడు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. చిప్ షేర్లలో హుషారు కొనసాగుతుండగా, ఎకనామీ షేర్లు డీల్‌గా ఉన్నాయి. నాస్‌డాక్ ఇపుడు 0.56 శాతం లాభంతో ఉంది. ఏఐ, చిప్ షేర్లలో స్కాన్‌డిస్క్ ఇవాళ 14 శాతం లాభంతో ఉంది. మైక్రాన్, ఇంటెల్ షేర్లు అయిదు శాతం చొప్పున లాభంతో ఉన్నాయి. ఎన్‌విడియా షేర్ స్థిరంగా ఉంది. బులియన్ ధరలు కూడా దాదాపు క్రితం ధరలే వద్ద ఉన్నాయి. రెడ్‌లో ఉన్నా… నష్టాలు నామమాత్రమే.
