ఎన్‌విడియాతో L&T డీల్
దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ డేటా సెంటర్‌ను ఎల్ అండ్ టీ నిర్మించబోతోంది. ఏఐ రంగంలో భారీ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ఇప్పటికే Vyoma.AI అనే అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇపుడు Vyoma.AI కూడా LTN Compute అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి ఎనవిడియాతో డీల్ కుదుర్చుకుంది. NVIDIA 8300 AI Factoryని నెలకొల్పనుంది. ఇది దేశంలోనే అతి పెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానుంది. భారీ స్థాయి ఇంటర్‌ఫేస్, ఫైన్ ట్యూనింగ్, ట్రైనింగ్ వర్క్ లోడ్‌తో పాటు పాటు అంతర్జాతీయ ఇన్నోవేషన్‌కు అనువుగా ఉంటుంది. దేశ ఏఐ ఇన్‌ఫ్రాలో ఈ సెంటర్ అంత్యంత కీలకం కానుంది. చెన్నైలో Vyomaకు ఉన్న డేటా సెంటర్ క్యాంపస్‌లో NVIDIA AI Factoryని ఏర్పాటు యనున్నారు. AI Factory వ్యాపారంలోకి L&T ప్రవేశించడం ఇదే తొలిసారి.
