For Money

Business News

టాటా సన్స్‌లో TESS, TCE విలీనం?

తమ గ్రూప్‌లోని రెండు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని టాటా ట్రస్ట్‌లు ప్రతిపాదించాయి. ఇలా చేయడం వల్ల తమ కంపెనీ ఆపరేటింగ్‌ కంపెనీ కావడంతోపాటు గ్రూప్‌ సంస్థలకు హోల్డింగ్‌ కంపెనీ అవుతుందని టాటా ట్రస్ట్‌లు భావిస్తున్నాయి. అయితే ఇలా చేయాలంటే ఈ ప్రతిపాదనకు టాటా సన్స్‌ నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుందని మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ సొల్యూషన్స్‌ (TESS), టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ (TCE)లను టాటా సన్స్‌లో విలీనం చేయాలని టాటా ట్రస్ట్స్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు టాటా ట్రస్ట్‌లు ఇవాళ ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. తమ ప్రతిపాదనలను పరిశీలించాలంటూ టాటా సన్స్‌ బోర్డుకు పంపినట్లు వెల్లడించింది. రెండు కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేస్తే… నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) నిబంధనల పరిధిలోకి టాటా సన్స్‌ రాదు. టాటా సన్స్‌ను లిస్ట్ చేయకుండా అన్‌లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ కొనసాగించాలన్న టాటా ట్రస్ట్స్‌ ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి.

Leave a Reply