ట్రాఫిక్ చలాన్లను కరెంటు బిల్లులో కలపండి
పెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ చలాన్ల వసూలుకు సుప్రీంకోర్టు కొత్త మార్గం సూచించింది. అలాంటి ట్రాఫిక్ చలాన్లను వాహన యజమాని కరెంటు బిల్లుకు జత చేయమని పేర్కొంది. వేలు, లక్షల కొద్ది E చలాన్లు జారీ చేస్తే సరిపోదని, వాటిని వసూలు చేయడం అతి పెద్ద సవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. 2012లో దాఖలైన ప్రజా ప్రయోజన పిటీషన్‌పై జస్టిస్ జేబీ పరీద్‌వాలా, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన బెంచ్ ఈ సలహా ఇచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తించి, ఈ చలాన్లు విధించాలంటే పిటీషన్ కోరారు. దేశ వ్యాప్తంగా రూ. 45,000 కోట్ల ఈ చలాన్లు జారీ చేయగా, రూ. 25,000 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన మొత్తం వసూలుకు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చలాన్ల వసూలుకు సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని కోర్టు పేర్కొంది.
