For Money

Business News

నిఫ్టి వొద్దు… షేర్లే ముద్దు

నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ ధర 90 డాలర్ల వైపు దూసుకుపోతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం వల్ల జరిగిన డామేజీకి ఇరాన్‌ ఎదురుగా నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్‌ డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్‌ తన డిమాండ్లపై పట్టు పడుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ క్రూడ్‌ 88 డాలర్లు దాటింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా. నిఫ్టికి 24,600 వద్ద తీవ్ర ప్రతిఘటన ఎదురువుతోంది. ఆగస్టు నెల అత్యధిక కాల్స్‌ 24600 వద్దే ఉండటం విశేషం. ఇక నిఫ్టి 50లో విప్రో స్థానంలో BSE షేర్‌ను చేరుస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ వార్త ముందే లీక్‌ కావడంతో నిన్న 4 శాతంపైగా BSE షేర్‌ పెరిగింది. చాలా రోజుల తరవాత F&O బ్యాన్‌ నుంచి ఎల్‌ఐపీ, కేన్స్‌ టెక్‌ బయట పడ్డాయి. తాజాగా బ్యాన్‌లోకి సెయిల్‌, బంధన్‌ బ్యాంక్‌ వచ్చి చేశాయి. ఇవాళ నిఫ్టిలో పెద్ద కదలికలు ఉండకపోవచ్చు. కేవలం ఫలితాలు, కార్పొరేట్‌ నిర్ణయాలకు షేర్లు స్పందించే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply