For Money

Business News

డైరెక్షన్‌ లేని వాల్‌స్ట్రీట్‌

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పులు లేవు. ఏఐ చిప్‌ షేర్లు కూడా నిలకడగా ఉన్నాయి. ఐపీఓ తరవాత తొలిసారి
రీటైల్‌ ఇన్వెస్టర్లు స్సేస్‌ఎక్స్‌ షేర్లను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయినా షేర్‌ రాత్రి లాభాల్లో ముగిసింది. ఇక ఎన్‌వీడియా భారీ డీల్‌ క్లోజ్‌ చేయనుంది. ఏఐ ఇన్‌ఫ్రా విస్తరణ కోసం ఈ కంపెనీ 50,000 కోట్ల డాలర్లను సమీకరించనుంది. గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌, బ్లాక్‌రాక్‌, కేకేఆర్‌ వంటి దిగ్గజ ఫైనాన్స్‌ కంపెనీలతో ఈ మేరకు ఒప్పందం కుదిరనట్లు తెలుస్తోంది. మరో వైపు ఇంటెల్‌ కంపెనీ 1500 కోట్ల డాలర్ల వాటాలను అమ్మాలని ప్రతిపాదించింది. దిగ్గజ చిప్‌ కంపెనీలను మించి ఈ షేర్‌ దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇపుడు షేర్ల అమ్మక ప్రతిపాదనతో రాత్రి షేర్‌ దాదాపు 4 శాతం పైగా క్షీణించింది.

Leave a Reply