అదానీ కేసు క్లోజ్
ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు పొందారన్న కేసు నుంచి ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ విముక్తి అయ్యారు. ఆయనపై వేసిన కేసును ఉపసంహరించుకోవడానికి అమెరికా న్యాయ విభాగం వేసిన పిటీషన్‌కు అమెరికా ఫెడరల్‌కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్ అంగీకరించారు. ఇంతకుమునుపు ఈ కేసు మూసివేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదానీ నుంచి స్వయంగా డిక్లరేషన్ వేయాలంటూ అదానీని ఆదేశించారు. ఆయన వేసిన డిక్లరేషన్ తరవాత కేసు విచారించిన జడ్జి… కేసు మూసివేసేందుకు అంగీకరించారు. అమెరికాలో 1000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామన్న అదానీ కమిట్‌మెంట్‌తో జడ్జి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసు నుంచి బయటపడేందుకు ఈ పెట్టుబడులు అదానీ పెట్టారని జడ్జి అనుమానించారు.
