For Money

Business News

లాభాలతో లిస్టయిన సాయి పేరంటరల్‌

గతవారం పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన సాయి పేరంటరల్‌ కంపెనీ షేర్లు ఇవాళ లాభాలతో లిస్టయ్యాయి. ఈ కంపెనీ ఒక్కోషేర్‌ను రూ. 392లకు అలాట్‌ చేయగా, ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.400 వద్ద లిస్టయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ ఇపుడు రూ.403.80 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ ధరతో పోలిస్తే ఈ షేర్‌ ఇపుడు 3 శాతం లాభంతో ఉంది. ఇవాళ ఫార్మా షేర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సాయి పేరంటరల్‌ షేర్‌ లాభాలతో లిస్ట్‌ కావడం విశేషం. అలాగే ఈ కంపెనీతో పాటు పబ్లిక్‌ ఆఫర్‌ చేసిన పవరేషియా, అమీర్‌ చంద్‌ జగదీష్‌ కుమార్‌ షేర్లు ఇవాళ ఏడు శాతం నష్టంతో లిస్టయ్యాయి.