ఇరాన్ ఆయిల్‌పై ట్రంప్ కన్ను
వెనుజులా మాదిరి ఇరాన్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ ఖర్గ్ ఐల్యాండ్ స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇరాన్ ఆయిల్ నిల్వల్లో 90 శాతం ఖర్గ్ ఐల్యాండ్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్‌లోనాయకత్వ మార్పు అన్నది ఇన్నాళ్ళు చేసిన ప్రచారం ఉత్తుదేనని ఇపుడు స్పష్టమైంది. మరోవైపు ఇరాన్ యురేనియం కూడా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీని కోసం ఇప్పటికే పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యెమెన్ నుంచి హౌతీల ఎంట్రీతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
