For Money

Business News

ఇంటర్‌నెట్‌ బ్లాకౌట్‌?

పశ్చిమాసియాలో యుద్ధానికి ఎపుడు తెరపడుతోందో తెలియడం లేదు. మరోవైపు అదనంగా పది వేల మందితో సైనిక దళాలను అమెరికా మోహరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ ఆయిల్‌కు గుండె అయిన ఖార్గ్‌ ఐల్యాండ్‌పై దాడికి అమెరికా సిద్ధమౌతున్నట్లు అమెరికా రాస్తోంది. మరోవైపు అమెరికా అన్నంతపని చేస్తుందని ఇరాన్‌ భావిస్తోంది. ట్రంప్‌ యుద్ధ విరామం, తాజా గడవువు ఉద్దేశం ఖార్గ్‌పై దాడి కోసమేనని ఇరాన్‌ అనుమానం. ఇప్పటికు ఖర్గ్‌ ఐల్యాండ్‌ రక్షణ కోసం అదనపు దళాలను ఇరాన్‌ మోహరించింది. ఇప్పటికే డిఫెన్స్‌ దళాలు అక్కడికి చేరుకున్నాయి. అయినా ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్‌ చాలా కఠినంగా వ్యవమరించే అవకాశముంది. అవసరమైతే ఇంటర్‌నెట్‌ వ్యవస్థాను ఛిన్నాభిన్నం చేసేందుకు ఇరాన్ వెనుకాడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రం హెచ్చరిక
ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్ అల్‌ మందేబ్ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను హూతీలు టార్గెట్ చేస్తారని అనుమానం వ్యవక్తమౌతోంది. అలాగే హర్ముజ్‌ జలసంధి ద్వారా వెళ్ళే అండర్‌ సీసబ్‌ కేబుల్స్‌ను కూడా ఇరాన్‌ దెబ్బతీయొచ్చని భారత్‌ భావిస్తోంది. యూరప్‌, అమెరికా దేశాలను అనుసంధానించే ఈ కేబుల్స్‌ ద్వారా ప్రపంచంలోని 33 శాతం డాటా ప్రవహిస్తోంది. బాబ్ అల్‌ మందేబ్ జలసంధితో పాటు హర్మజ్‌ జలసంధిలో కొన్ని వేల కిలోమీటర్ల మేర కేబుల్స్‌ విస్తరించి ఉన్నాయి. ప్రపంచ ఇంటర్నెట్‌కు అత్యంత కీలకం. వీడియో కాల్స్‌, ఈమెయిల్స్‌, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులకు సంబంధించిన డేటానంతా మోసుకెళ్తాయి. ఎర్రసముద్రం ద్వారా 17 అంతర్జాతీయ కంపెనీల కేబుళ్లు వెళ్తున్నాయి. ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలోని ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో వీటిదే ప్రధానపాత్ర. అలాగే పర్షియన్‌ గల్ఫ్‌లో కూడా. భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు ఇవి కీలకం. దీంతో కేంద్ర టెలికాం విభాగం రంగంలోకి దిగింది. నిన్న సంబంధి శాఖల అధికారులతో, టెలికాం కంపెనీలతో టెలికాం విభాగం చర్చలు జరిపింది. ఒకవేళ ఈ రెండు జలసంధుల ద్వారా వెళ్ళే కేబుల్స్‌ దెబ్బతింటే పరిస్థితి ఏమిటో మదింపు వేసి నివేదిక ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అట్లాంటిక్‌ కన్నా పసిఫిక్‌ ద్వారా అత్యధిక అండర్‌ సీ కేబుల్‌ ఉంది. ఇపుడు మన దేశానికి చెందిన టాటా టీజీఎన్‌ గల్ఫ్‌ ద్వారా కేబుల్స్‌ వెళుతున్నాయి. అలాగే ఎయిర్‌టెల్‌, ఫ్లాగ్‌ టెలికాం కంపెనీలు కేబుల్స్‌ కూడా వెళుతున్నాయి. అలాగే జియో ఇండియా ఎక్స్‌ప్రెస్‌, జియో ఇండియా ఏషియా ఎక్స్‌ప్రెస్‌ కూడా కేబుల్స్‌ వేస్తోంది. అలాగే గూగుల్‌ కూడా వేస్తోంది. కేబుల్స్‌ను ధ్వంసం చేస్తే వెంటనే పూర్తి స్థాయి బ్లాక్‌ఔట్‌ ఉండదని, పాక్షికంగా సర్వీసులు దెబ్బతినే అవకాశముందని టెలికాం వర్గాలు అంటున్నాయి. ముందుగా టెలికాం మౌలిక సదుపాయాలు దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.