For Money

Business News

ఐటీ షేర్లకు ఆంథ్రోపిక్‌ దెబ్బ

ఏఐ రంగంలో ఆంథ్రోపిక్‌ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా Claude Cowork, Claude Code అనే ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు ఆంథ్రోపిక్‌ వెల్లడించింది. యాప్‌ కనెక్టర్‌ లేకుండానే యూజర్స్ స్క్రీన్‌పై నేరుగా ఆపరేట్‌ చేసే సౌకర్యం ఈ ఫీచర్‌ ఇస్తుంది. దీని ద్వారా టాస్క్‌లను పూర్తి చేయడం, యాప్‌లను ఓపెన్‌ చేయడంతో పాటు బ్రౌజర్స్‌ నావిగేషన్‌ చేస్తూ కంప్యూటర్‌ను కంట్రోల్‌ చేస్తుందని ఆంథ్రోపిక్‌ వెల్లడించింది.దీంతో పలు ఐటీ కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. ఇవాళ వాల్‌స్ట్రీట్‌లో నాసడాక్‌ 0.40 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్ పీ 500, డౌజోన్స్‌ మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేనందు వల్ల మార్కెట్‌ స్తబ్దుగా ఉంది. అయితే క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌ మాత్రం కాగిపోతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లకు చేరువైంది. బులియన్‌ మాత్రం గ్రీన్‌లో ఉన్నా… ధరల పెరుగదల అంతంత మాత్రమే.