దూసుకుపోతున్న వాల్‌స్ట్రీట్
యుద్ధ విరమణ దిశగా అమెరికా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో వాల్‌స్ట్రీట్‌లో ఉత్సాహం పరుగులెత్తుతోంది. యుద్ధం విరమణకు సంబంధించి ఇరాన్ నేతలే తనకు ఫోన్ చేశారని, చర్చలు కొనసాగుతున్నందున అయిదు రోజులు దాడులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సరఫరా పెరగాలన్నదే తన లక్ష్యమని ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా బ్రెంట్ క్రూడ్ పది శాతం తగ్గి 96 డాలర్లకు పడిపోయింది. అలాగే బులియన్ ధరల్లో కూడా స్థిరత్వం వచ్చింది. అయితే డాలర్ పతనం అంతంత మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీతో పాటు డౌజోన్స్ కూడా రెండు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ప్రధాన టెక్ షేర్లు మూడు శాతం నుంచి అయిదు శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.
