ట్రంప్‌తో చర్చలే జరగలేదు ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాము చర్చలు జరపలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనపై స్పందిస్తూ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని తాము చేసిన హెచ్చరికలతో ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ అధికారిక టెలివిజన్ (IRIB) పేర్కొంది. ప్రభుత్వానికి దగ్గరి సంబంధం ఉన్న మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇరాన్ విదేశాంగ శాఖను ఉటంకిస్తూ వార్త ప్రసారం చేసింది. రెండు దేశాల మధ్య ఎలాంటి చర్యలు జరగలేదని మెహర్ పేర్కొన్నట్లు అల్ జజీరా తెలిపింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు ట్రంప్ వేసిన ప్లాన్ అని మెహర్ పేర్కొంది. యుద్ధం కోసం సన్నద్ధమయ్యేందుకు కొంత గడువు అమెరికాకు అవసమని, అందుకే ఈ ఎత్తుగడ వేసిందని ఇరాన్ విదేశాంగ శాఖను పేర్కొంటూ మెహర్ వార్తా కథనం రాసింది. శాంతి కోసం కొన్ని దేశాలు చొరవ తీసుకుంటున్న మాట వాస్తవమేనని, అయితే చర్చలు తొలుత యుద్ధం ప్రారంభించిన అమెరికాతో మొదలు పెట్టాలని ఇరాన్ స్పష్టం చేసింది.
