ట్రంప్ ప్రసంగంలోని కీలక 15 అంశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రసంగంలోని ప్రధానాంశాలు ఇవి
మేము ఇరాన్‌తో లోతైన చర్చలు జరిపాము
ప్రధానమైన అంశాలపై మా మధ్య ఒప్పందం కుదిరింది.
ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నర్ చర్చలు జరిపారు
ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటం మాకు ఇష్టం లేదు
ఇరాన్‌కు చెందిన సీనియర్ ప్రధాన నాయకులతో అమెరికా ప్రతినిధులు మాట్లాడారు
ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి రావాలని భావిస్తున్నాయి
ఇరు పక్షాలు ఈ రోజు ఫోన్‌లో చర్చలు జరిపే అవకాశం ఉంది
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గురించి ట్రంప్‌కు ఎలాంటి సమాచారం లేదు. అతను ఇంకా బతికే ఉన్నాడో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు
ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను: ట్రంప్
ఒకవేళ ఒప్పందం కుదిరితే, అది ఇరాన్‌కే కాదు ఆ ప్రాంతానికి కూడా మంచిది.
ఇటీవల ఇరాన్ గురించి ఇజ్రాయెల్‌తో మాట్లాడాను : ట్రంప్
ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని నేను హామీ ఇవ్వలేను : ట్రంప్
ఫోన్ చేసింది ఇరాన్‌వారే, నేను చేయలేదు : ట్రంప్
ప్రపంచంలో వీలైనంత ఎక్కువ చమురు ఉండాలని నేను కోరుకుంటున్నాను
ఒకవేళ ఒప్పందం కుదిరితే, సుసంపన్నమైన యురేనియం పొందడం చాలా సులభం అవుతుంది
మేముఉ B-2 బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే, రెండు వారాల్లోనే అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసి….వారు ఇజ్రాయెల్‌పై వాడేవారు.
ఇరాన్‌తో అనేక అంశాలపై పరస్పర అంగీకారం ఉంది. ఇప్పటివరకు మేము 15 అంశాలు గుర్తించాము
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని గుర్తించినట్లే ఇరాన్‌లో కూడా అలాంటి వ్యక్తిని గుర్తిస్తాం
