మార్కెట్‌కు ట్రంప్ టెన్షన్
5 రోజులు దాడులు లేవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలతో రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో సూచీలు రెండు శాతం దాకా పెరిగాయి. క్రూడ్ పది శాతం దాకా పడటంతో సూచీలు ఉత్సాహంగా ట్రేడయ్యాయి. అయితే ట్రంప్‌ప్రకటనను ఇరాన్ ఖండించడంతో లాభాలు చాలా వరకు తగ్గాయి. అయినా సూచీలు ఒక శాతంపైగా లాభాలతో ముగిశాయి. అర్ధరాత్రి తరవాత ట్రంప్‌తో చర్చలు జరగలేదని ఇరాన్ స్పష్టం చేయడంతో అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇపుడు అర శాతంపైగా నష్టంతో సూచీలు ట్రేడవుతున్నాయి. రాత్రి తగ్గిన క్రూడ్ మళ్ళీ పెరిగాయి. ఇపుడు బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 103 డాలర్లకు చేరింది.
