ఇక నుంచి చిన్న సిలిండర్లు!
ప్రజల్లో గ్యాస్ పట్ల ఆందోళన తగ్గించేందుకు అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక నుంచి చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని భావిస్తోంది. ఇపుడు గృహ అవసరాల కోసం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అయితే ఇపుడున్న గ్యాస్‌ను ఎక్కువ సిలిండర్లలో నింపి సరఫరా పెంచేందుకు పది కిలోల గ్యాస్ సిలిండర్లను వినియోగించాలని కంపెనీలు భావిస్తున్నాఇ. ఇలా చేయడం వల్ల చాలా మందికి సరఫరా జరిగి.. జనంలో ఆందోళన తగ్గుతుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎపీజీ గ్యాస్ వినియోగంలో 76 శాతం గృహ అవసరాల నుంచే వస్తోంది. 90 శాతం గ్యాస్ గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. యుద్ధం కారణంగా సరఫరా తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ మర్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఈలోగా సరఫరా పెంచేందుకు చిన్న సిలిండర్లు వాడాలని భావిస్తున్నాయి.
