15 శాతం పెరిగిన షేర్
సాధారణంగా ఐపీఓకు ముందు లాకిన్‌లో ఉన్న షేర్లు మార్కెట్‌లోకి వస్తే ఆ కంపెనీ షేర్లు క్షీణిస్తాయి. ఎందుకంటే లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి. అలాంటి నిన్న లాకిన్ పీరియడ్ నుంచి అర్బన్ లిమిటెడ్‌కు చెందిన 94 కోట్ల షేర్లు మార్కెట్‌లోకి వచ్చాయి.దీంతో ఒక్కసారిగా షేర్లు పడుతాయని భావించారు. అయితే నిన్న సుమారు రూ. 632 కోట్ల విలువైన షేర్లను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. దీంతో కంపెనీలో ఈ ఫండ్ వాటా 1.89 శాతం నుంచి 3.98 శాతానికి పెరిగింది. పైగా ఇతర ఇన్వెస్టర్లు కూడా ఇపుడు ఈ షేర్ కొనేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ఈషేర్ ధర ఇపుడు 15 శాతం పెరిగి రూ.127ని దాటింది. నిన్న ప్రి ఐపీఓ లాకిన్ పీరియడ్ పూర్తి కావడంతో ఏకంగా 66 శాతం ఈక్విటీ మార్కెట్‌లోకి వచ్చేసింది. అదే స్థాయిలో కొనుగోళ్ళ ఆసక్తి కూడా వచ్చింది. లాకిన్ పీరియడ్ పూర్తయినా.. చాలా మంది తమ షేర్లను అమ్మేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఊహించిన స్థాయిలో లిక్విడిటీ రాలేదు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 103లకు ఆఫర్ చేసింది. అక్కడి నుంచి ఈ షేర్ రూ. 201లకు చేరినా… తరవాత కరెక్షన్‌తో రూ.100 దాకా పడిపోయింది. ఇపుడు మళ్ళీ ఈ కౌంటర్‌లో ఆసక్తి కనిపిస్తోంది. మరి ఇవాళ్టి ర్యాలీ కొనసాగుందా లేదా అమ్మకాల ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి.
