స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా… లాభనష్టాల్లో పెద్ద తేడా లేదు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలోనూ ఇదే తీరు కన్పిస్తోంది. కొన్ని మార్కెట్ల చిన్న మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా మిశ్రమంగా ఉంది. జపాన్, హాంగ్‌సెంగ్ సూచీల్లో పెద్ద మార్పు లేదు. సింగపూర్ నిఫ్టి కూడా గ్రీన్లో ఉన్నా.. నామమాత్రమే. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.